Vinesh Phogat: వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్‌ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఒలింపిక్స్ అధికారులు డిస్‌క్వాలిఫై చేశారు. రెజ్లింగ్‌ రూల్స్ ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Vinesh Phogat: వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి
New Update

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్‌ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఫొగాట్.. ఈవెంట్‌కు ముందు బరువు కొలవగా కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినా ఫలితం చేజారిపోయింది. అయితే ఇలా ఎందుకు జరిగింది. అసలు రెజ్లింగ్‌ నిబంధనలు ఎలా ఉంటాయి అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

రెజ్లింగ్‌ విభాగాలు

ఒలింపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో మహిళలకు 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. ఇందులో 50 కేజీల కేటగిరిలో ఫొగాట్‌ పోటీ పడుతోంది. ఇక పురుషులకు కూడా 57 నుంచి 125 కిలోల వరకు ఆరు కేటగిరీలు ఉంటాయి. అయితే పోటీలో పాల్గొనే క్రీడాకారణి ఆయా కేటగిరిలో ఉన్నారని నిర్ధరించేందుకు పోటీ జరిగే ఉదయం బరువును కొలుస్తారు. ప్రతి బరువు కేటగిరిలో కూడా రెండు రోజుల పాటు టోర్నమెంట్‌ జరుగుతుంది. వినేష్ పోటీపడే 50 కిలోల కేటగిరీలో పోటీలు మంగళవారం, బుధవారం నిర్వహిస్తున్నారు. దీంతో ఈరోజు తలపడే క్రీడాకారిణులు తప్పనసరిగా నిర్ణీత కేటగిరిలో బరువు ఉండాల్సిందే. ఒకవేళ లేకుంటే వారిపై అనర్హత వేటు పడుతుంది.

క్రీడాకారులు బరువు కొలిచే సమయంలో కూడా వాళ్లకి 30 నిమిషాల పాటు టైమ్‌ ఇస్తారు. ఈ వ్యవధిలో వాళ్లు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు వేసుకొనే జెర్సీలతో బరువు కొలుస్తారు. అలాగే వాళ్లకి ఆరోగ్య పరీక్షలు కూడా చేసి ఎలాంటి అంటువ్యాధులు లేవని నిర్ధరిస్తారు. అంతేకాదు క్రీడాకారులు తమ గొళ్లు కత్తిరించుకున్నారో లేదో కూడా చూస్తారు. ఇక రెండో రోజు పోటీపడే వారికి బరువు కొలతకు కేవలం 15 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు.

వినేష్ విషయంలో ఏం జరిగింది

మంగళవారం బౌట్‌ సమయంలో వినేష్.. తన బరువును కంట్రోల్‌లోనే ఉంచుకుంది. క్రీడాకారులు రెండురోజు వరకు బరువును నిర్ణీత కేటగిరి పరిధిలో ఉంటుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే అనర్హత వేటు పడుతుంది. అయితే మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోలు ఎక్కువగా బరువు ఉంది. దీంతో బరువు తగ్గించుకునేందుకు ఆమె రాత్రి సమయంలో జాగింగ్‌, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసి చాలా శ్రమించింది. చివరికి పోటీలో పాల్గొనేముందు బరువు కొలిచే సమయంలో కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలని భారత బృందం ఒలింపిక్స్‌ అధికారులను కోరినా.. వారు తిరస్కరించినట్లు తెలిసింది.

2016, 2020లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో వినేష్ 53 కేజీల బరువు కేటగిరీలో పోటీ పడింది. ఈసారి మాత్రం 50 కేజీల కేటగిరిలో బరిలోకి దిగింది. మరో విషయం ఏంటంటే బరువు తగ్గించుకునేందుకు వినేష్.. జుట్టు కత్తించుకోవడంతో పాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకున్నట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన అనంతరం ఆమె వెంటనే వర్కవుట్ చేయడం మొదలుపెట్టింది. ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో భారత్‌కు మూడు బ్రాంజ్‌ పతకాలు మాత్రమే వచ్చాయి. ఇంతవరకు ఒక్క స్వర్ణ పతకం రాలేదు. రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన వినేష్‌.. భారత్‌కు బంగారు పతకం సాధిస్తుందని అందరు అనుకున్నారు. చివరికి పరిస్థితులు ప్రతికూలంగా ఎదురవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాదు రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్స్‌ వరకు వెళ్లిన భారత తొలి క్రీడాకారిణీ కూడా వినేష్ ఫొగాట్‌ కావడం మరో విశేషం.

#telugu-news #vinesh-phogat #2024-paris-olympics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి