నేషనల్ National Weather Update Today : ఎక్కడ చూసినా వరుణుడి విధ్వంసమే.. అక్కడ కూడా నాన్ స్టాప్ బాదుడు..!! దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావారణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Telangana Rains: ఇంత లేట్‌గా చెబితే ఎలా సర్..? ఆలస్యంగా సెలవుల ప్రకటనపై తల్లిదండ్రుల అసంతృప్తి..! తెలంగాణలో 48గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండగా.. స్కూల్స్, కాలేజీల సెలవు ప్రకటన ఆలస్యంగా రావడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. By Trinath 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Rain Alert: హైదరాబాద్‌కు ముసురు..దంచికొడుతున్న వాన.!! హైదరాబాద్ ను ముసురు చుట్టేసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్ ను ముసురు వీడటం లేదు. సుల్తాన్ బజార్ ,కోఠి, బేగంబజార్, ఆబిడ్స్, లిబర్టీ, బంజారహిల్స్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వానపడుతూనేఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ముసురుకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling AP Floods 2023 : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, అలర్ట్ అయిన అధికారులు.. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ధ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు భారీగా వచ్చి గోదావరిలో చేరడంతో గోదావరి వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న మొన్నటిదాకా ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన గోదావరి నేడు 26 అడుగుల వద్దకు చేరి జలకళతో కళకళలాడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. By Shareef Pasha 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods 2023: ఏపీలో విస్తారంగా వర్షాలు...ఆ జిల్లాలకు భారీ వర్షసూచన ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. By Shareef Pasha 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Telangana Rains : తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రాగల మూడు, నాలుగురోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఆగకుండా ముసురు పడుతుండగా... ఇవాళ్టి నుంచి మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. By Shareef Pasha 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Yamuna Floods : తాజ్‌మహల్‌ను తాకిన యమునా ..కైలాస మహాదేవ గర్భగడిలోకి వరదనీరు.!! ఢిల్లీలో యమునా నది ఉప్పొంగుతోంది. ఆగ్రాలో ఉగ్రరూపం దాల్చి 495.8 అడుగులకు పెరిగింది. దీంతో చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల గోడలకు తాకింది. యుమునా వరద నీరు తాజ్ మహల్ ను తాగడం గత 45ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపించింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజ్ మహల్ వెనకున్న తోటను వరద ముంచెత్తింది. యుమనా నది చివరి సారిగా 1978లో వచ్చిన వరదల సమయంలో తాజ్ మహల్ ను తాకింది. By Bhoomi 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మళ్లీ పెరిగిన యమునా నీటి మట్టం..కొనసాగుతోన్న వరద ముప్పు..!! దేశ రాజధాని ఢిల్లీ ఇంకా జలదిగ్భందంలోనే ఉంది. సోమవారం యమునా నది నీటి మట్టం తగ్గినట్లే తగ్గి...మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ మరోసారి వరదముంపును ఎదుర్కొవల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరదనీటిలో చిక్కుకున్నాయి. అటు వరద బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండాలని కేబినెట్ మంత్రి అతిషి విజ్ఞప్తి చేశారు. యమునా నది నీటిమట్టం పెరగడం వల్ల ఢిల్లీలో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ట్వీట్ చేశారు. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీలో గంగమ్మ ఉగ్రరూపం..13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అటు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి. అంతేకాకుండా భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ఢిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయిపైనే ప్రవహిస్తుండగా.. ఇప్పుడు యూపీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. By Vijaya Nimma 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn