Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండలు ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండలు ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.
రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది.నిజమే మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏ తేదీలో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి తాపాన్ని తప్పించుకోవటానికి..కొద్ది రోజులు సేదతీరటానికి ఊటీకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి ఎందుకంటే..భారీ వర్షాలు కారణంగా అక్కడి అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్ఎఫ్ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
హైదరాబాద్‌లో గరువారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. కానీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది.