Heavy Rains: కోస్తాకు భారీ వర్షసూచన..అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

New Update
AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!

Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా ద్రోణి వ్యాపించింది. దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి రాయపూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల్లో మరింత కదలిక వచ్చింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Also read: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు