/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)
Yellow Alerts:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. పశ్చిమ - మధ్య బంగాళాఖాతం ఇది ఏర్పడడం వలన తెలంగాణ జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడనుంది. దీంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచడమే కాకుండా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ కారణంగా అక్కడ 14 జిల్లాలకు ఎల్లో కార్డ్‌ను జారీ చేసింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే...మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడవచ్చని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read: India: జపాన్‌ను దాటేసిన భారత్..మూడో శక్తివంతమైన దేశంగా ఎదుగుదల