India: జపాన్‌ను దాటేసిన భారత్..మూడో శక్తివంతమైన దేశంగా ఎదుగుదల

అభివృద్ధి చెందుతున్న భారత్ నెమ్మదిగా ఆర్ధికశక్తిగా ఎదుగుతోంది. తాజాగా ఆసియా పవర్ ఇండెక్స్‌లో రీజినల్ పవర్స్‌లో సత్తా చాటింది. జపాన్‌ను దాటేసి మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. 

author-image
By Manogna alamuru
New Update
india

Aisa Power Index: 

కొన్నిరోజుల్లో భారతదేశం ప్రంచ ఆర్ధిక శక్తిగా ఎదుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం కనిపించడం లేదు. నెమదిగా ఒక్కొక్క మెట్టునే ఎక్కుతూ ప్రపంచ ఆర్ధిక శక్తిగా ముందుకు దూసుకుపోతోంది. ఆర్ధికంగా బలపడుతూ ఎదుగుతున్న మన ప్రజాస్వామ్య దేశం కొన్నిరోజులకు అమెరికా, చైనాలను కూడా దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి పాన్‌ను వెనక్కు నెట్టేసి ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్స్‌లో భారతదేశం సత్తా చాటింది. ఆర్థిక పునరుద్ధరణ, మల్టీలాట్రల్ డిప్లమసీ భారత ప్రభావాన్ని మరింత పెంచింది. ప్రపంచంలో ఏ దేశానికి లేనట్టుగా భారత్ ఇటు రష్యాతో, అటు ఉక్రెయిన్‌తో స్నేహం చేయగలుతుంది. ఇక లమైన ఆర్థిక వృద్ధి, యువ జనాభా, ప్రాంతీయ భద్రతా విషయాల పరంగా..ఇండియా ఆసియా పవర్ ఇండెక్స్‌లో  మూడో స్థానానికి చేరడానికి  ప్రధాన కారణాలయ్యాయి. ఇది భారత భౌగోళిక రాజకీయ స్థాయిని, ప్రభావాన్ని పెంచడానికి దోహదం అయింది. దీంత ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారతదేశం జపాన్‌ను అధిగమించి మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఇది పెరుగుతున్న భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రతిబింబిస్తుంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. 2018లో లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ రేటింగ్స్ ఇస్తోంది. ఇది ఆసియా-పసిఫిక్ అంతటా 27 దేశాలను అంచనా వేస్తుంది. కోవిడ్ మహమ్మారి వల్ల అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతిన్న తరుణంలో, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గా ఉంది. ఇది కూడా పవర్ ఇండెక్స్ రేటింగ్‌కి కారణమైంది.

Also Read: మొదటిసారి 26 వేల కంటే ఎగువకు నిఫ్టీ..ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

Advertisment
తాజా కథనాలు