ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

ap rains
New Update

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా కదులుతూ.. వాయు గుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నవంబర్ 25న వాయు గుండంగా మారి.. 27వ తేదీకి తమిళనాడు, శ్రీలంక వైపు మళ్లుతుందని తెలిపారు. ఈ తుపాను ప్రభావం ఏపీతో పాటు తమిళనాడు, శ్రీలంకలో కూడా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం..

ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెండ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు తప్పవు. అసలే ఇది ధాన్యం చేతికి వచ్చే సమయం. ఇలాంటి సమయాల్లో జాగ్రత్త వహించాలని రైతులను అధికారులు సూచించారు. కోతకు వచ్చిన ధాన్యం తడవకుండా ఉండేలా జాగ్రత్త పడాాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు

 

 

#ap-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe