Dana Cyclone Effect: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాన్..వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది ఒడిశా, తూర్పు ఆంధ్రా ప్రాంతాలను బలంగా తాకనుంది. దీని కారణంగా ఇక్కడ ఈదురు గాలులతో కడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వైజాగ్, శ్రీకాకుళం, ఒడిశాలలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కేంద్ర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతోంది. పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 460 కిలోమీటర్లు, ధమ్రాకు 490 కి.మీ., సాగర ద్వీపానికి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాన్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు వస్తున్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 100 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..20 సెంటీ మీటర్లకు మించి వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో ఒడిశాలోని జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, కటక్, భద్రక్, జాజ్‌పూర్, బాలేశ్వర్, మయూర్‌భంజ్...పూరీ, ఖుర్దా, కేంఝర్, నయాగఢ్, ఢెంకనాల్ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ ఎలర్ట్‌లు జారీ చేశారు. శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాలకు కూడా ఆరెంజ్ అలెర్ట్‌ను ఇచ్చారు.
ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!
ఒడిశా ముందస్తు చర్యలు...
దానా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని రకాలుగా దానిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయింది. పదేళ్ళ క్రితం తుఫాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలు పునరావృతం కాకూడదని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. 1999లో వచ్చిన ఫణి తుఫాన్ ఒడిశాను శ్మశానవాటికగా మార్చింది. పదివేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడు మళ్ళీ దానా తుఫాను అవే పోలికలతో ఉండడం...అంతే బలంగా ఒడిశాను తాకనుండడంతో... ఈసారి ముందస్తు జాగ్రత్త చర్యలను చేసుకుంటోంది ఒడిశా. పదేళ్ళ క్రితం జరిగినది పునరావృతం కాకూడదని భావిస్తోంది.
ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
భారత నావికాదళం...
ఒడిశాలో నష్టం సంభవిస్తే వెంటనే సహాయం చేసేందుకు భారత వాటర్ ఫోర్స్ రెడీగా ఉంది. తూర్పు నౌకాదళ కమాండ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా , పశ్చిమ బెంగాల్‌లో ఉన్న నౌకాదళ అధికారులతో సమన్వయంతో మొత్తం యంత్రాంగాన్ని సిద్దం చేసింది. ఈస్టర్న్ ఫ్లీట్ నుండి రెండు నౌకలు సముద్రం ద్వారా సహాయక చర్యలకు మద్దతుగా రెస్క్యూ , డైవింగ్ టీమ్‌లతో సహా అవసరమైన సామాగ్రితో మోహరించారు. మరోవైపు భారత వైమానిక దళం IL-76, AN-32 విమానాలను ఉపయోగించి 150 మంది NDRF సిబ్బందిని.. 25 టన్నుల సహాయ సామాగ్రిని భువనేశ్వర్‌కు తరలించింది.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
ఇక ఒడిశా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దాదాపు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకూడదని భావిస్తోంది ఒడిశా ప్రభుత్వం. ఆలయాలను మూసి వేసింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని విమానాశ్రయాలు కూడా అప్రమత్తమయ్యాయి. రెండు రోజుల పాటూ ఈ రెండు ఎయిర్ పోర్ట్‌లూ పని చేయవు. ఇక్కడకు వచ్చే విమానాలు కొన్నింటిని రద్దు చేయగా..మరి కొన్నింటిని దారి మళ్ళించారు. మరోవైపు రైళ్ళను కూడా కాన్సిల్ చేశారు. దాదాపు 200 రైళ్ళను కాన్సి చేసింది దక్షిణ రైల్వే. మరి కొన్నింటిని దారి మళ్ళించింది.
ఇది కూడా చూడండి:Blink it: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే