Rain Alert: చలికాలంలో కూడా వదలని వరుణుడు.. రెండ్రోజుల పాటు వర్షాలే

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ దిశల నుంచి బంగాళఖాతం మీదుగా రాష్ట్ర వైపు గాలుల వీస్తుండమే ఈ వర్షాలకు కారణమని పేర్కొంది.

Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
New Update

Rain Alert in Telangana: తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ దిశల నుంచి బంగాళఖాతం మీదుగా తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే ఈ అకాల వర్షాలకు కారణమని తెలిపింది. మరోవైపు మంగళవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలోని దేవరుప్పులలో 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగు పడటంతో కోహీర్ మండలంలోని ఎక్కల్‌దేవికుంట కాలనీకి స్వప్న (30) అనే మహిళ మృతి చెందడం కలకలం రేపింది.

Also Read: పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..

#rains #rain-alert-in-telangana #weather-updates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe