ఏపీకి పొంచి ఉన్న మరో తుపాన్ ముప్పు డిసెంబర్ 16 న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది 18 వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అది శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపు కొనసాగుతోందని చెబుతున్నారు. By Bhavana 11 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీని ఇప్పటికే మిచౌంగ్ ముంచేసి పోయింది. ఇంకా ఆ మునక నుంచి పైకి రాని ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖాధికారులు వెల్లడించారు. మిచౌంగ్ ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంటను దెబ్బతీసింది. చేతికి వచ్చిన పంట నోటికి రాలేకపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తుఫాన్ ముప్పు అనేసరికి రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. డిసెంబర్ 16 న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది 18 వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అది శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపు కొనసాగుతోందని చెబుతున్నారు. దీని ప్రభావం ఎక్కువగా కేరళ పై ఉండే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఏపీలోకి రావడానికి టైమ్ పట్టినప్పటికీ దాని ప్రభావం మాత్రం భారీ తుఫాన్ గా ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. భారీ తుఫాన్ ఏర్పడితే మాత్రం ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇంకా పొలంలో పంటలు ఉంచిన రైతులు వెంటనే కోతలు మొదలుపెట్టి 15 వ తేదీ లోపే పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు. మిచౌంగ్ తుఫాన్ బాధితులకు నష్టపరిహారాన్ని అందించే పనిలో జగన్ ప్రభుత్వం బిజీగా ఉంది. ఈ సమయంలో మరో తుఫాన్ రాష్ట్రం మీద విరుచుకుపడుతుందని తెలియజేయగానే మరింత అలర్ట్ అవుతుంది. ఈసారి ముందుస్తు చర్యలకు సిద్దంగా ఉంది. తుఫాన్లు వెంటాడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేస్తోంది. Also read: వైసీపీకి షాక్ మీద షాక్..వైసీపీ ఎమ్మెల్యే తనయుడు రాజీనామా! #ap #toofan #michaung #december15 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి