Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి అల్పపీడన గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో శుక్రవారం, శనివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ,రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
పశ్చిమ, నైరుతి దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ, యానాం మీదుగా అల్పపీడనం నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
Also read: రిషి సునక్ ఓటమి… కేవలం 410 సీట్లే..చరిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రజలు!