Rain Alert: మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్..

వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరికాసేపట్లో విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు.

Rain Alert: మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్..
New Update

Andhra Pradesh Weather Forecast: వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరికాసేపట్లో విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రానున్న 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సెప్టెంబర్ నెలలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం నామోదవుతుందని అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్..

ఏపీలోని ఈ ప్రదేశాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

తెలంగాణకూ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్..

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ మొదటి, రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాగల మూడు రోజుల పాటు తెలంగాణాలోని ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేసింది హైదరాబాద్ ఐఎండీ. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.

రానున్న మూడు రోజుల పాటు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భారత వాతావరణ శాఖ వెడుదల చేసిన రిపోర్ట్..

స్కైమేట్ వాతావరణ నివేదిక..

publive-image

Also Read: Weather Forecast: హమ్మయ్య.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం..

ISRO Next Mission: ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ఇస్రో నెక్ట్స్ టార్గెట్ అదేనా? ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ మీకోసం..

#ap-weather-forecast #rain-alert-in-andhra-pradesh #heavy-rain-alert-in-ap #andhra-pradesh-weather-forecast #heavy-rain-alert-for-andhra-pradesh #rain-alert-for-ap #rain-alert
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి