Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంపై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.