Watch Video : ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతాం : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ వార్తాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. 4 శాతం ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ముస్లీం రిజర్వేషన్లను మేము కాపాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

New Update
Press Meet : గెలుపు తరువాత చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారం(Election Campaign) గడువు ముగియనుండటంతో పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీ(AP) లో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(TDP-Janasena-BJP Alliance)ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ వార్తాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు. అయితే ప్రధాని మోదీ.. 4 శాతం ఉన్న ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. తమ రాష్ట్రంలో ముస్లీం రిజర్వేషన్లను మొదటి నుంచే కాపాడుతున్నామని.. ఇప్పుడు కూడా కాపాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: పిఠాపురంలో హై ఓల్టేజ్.. అటు మెగా పవర్ స్టార్.. ఇటు జగన్ సర్కార్..!

అయితే ప్రధాని మోదీ(PM Modi).. ముస్లీంలకు రిజర్వేషన్లు(Muslim Reservations) తీసేస్తామని చెబుతుండగా చంద్రబాబు కూటమితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు కూటమిలో ఉంటునే ప్రధానికి ఎలా వ్యతిరేకంగా వెళ్లగలరు అంటూ అడుగుతున్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు నాయుడు ముస్లీం రిజర్వేషన్లు ఎలా కాపాడతారనే అంశంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలాఉండగా.. ఏపీలో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఇక ఈరోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీల అగ్రనేతలు సుడాగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: కుప్పంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీల మధ్య గొడవ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు