Mallikarjun Kharge : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు మల్లికార్జున ఖర్గే. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని పేర్కొన్నారు.

New Update
Mallikarjun Kharge : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

Mallikarjun Kharge: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెలంగాణలో పర్యటించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాటాడిన ఆయన కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ పార్టీ పై విమర్శల దాడికి దిగారు. మోదీ ప్రభుత్వం పేద వాళ్ళకోసం పనిచేయదని అన్నారు. కేవలం డబ్బు ఉన్న వాళ్ళ కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికలు మోదీ చివరి ఎన్నికలు అవుతాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమి చెందుతుందని జోస్యం చెప్పారు.

ALSO READ: హిందువుల విశ్వాసాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు

మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. "తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చాం.. ఇప్పటికి ఐదు హామీలు నెరవేర్చామని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఒక్కటి మాత్రమే మిగిలింది.. ప్రతి పథకాన్ని అమలు చేసి తామేంటో నిరూపించుకుంటాం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మీకు హామీ ఇస్తున్నాను, మేము నెరవేర్చగలవాటిని మాత్రమే చెప్తాము." అని అన్నారు.

మోదీ ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులకు కార్మిక చట్టాలను పటిష్టం చేసేందుకు కృషి చేస్తామన్నారని తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని.. పెద్దల సంక్షేమం బీజేపీ అజెండా అని చురకలు అంటించారు.


Advertisment
Advertisment
తాజా కథనాలు