Andhra Pradesh: ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి: బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్

ఎన్డీయే కూటమి అధికారం లోకి వస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
Andhra Pradesh: ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి: బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్

బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి అధికారం లోకి వస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ' ప్రధాని మోదీ మనకు ఒక సందేశాన్ని అందించారు. అదే వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రా. ఆంధ్రప్రదేశ్‌లో డబుల ఇంజిన్ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే కేంద్రం అందించే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. ఈ ఐదు సంవత్సరాలు అలాంటివేమి కూడా సరిగా జరగలేదు. అలాంటివి జరగకుండా ఉండాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి.

Also read: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రాజధానిని అభివృద్ధి చేయలేకపోయారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తేనే.. వచ్చే ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అనేది జరగదు. పోలవరం డిజైన్‌లో మార్పులు చేశారు. ఈ ప్రాజెక్టు పునాదుల్లో లోపం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం చాలా ముఖ్యమైనది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక.. పోలవరం కూడా పూర్తి చేస్తాం. అలాగే ప్రజలకి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తాం. ఆంధ్రాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని' సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు.

ఇదిలాఉండగా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు బీజేపీ-టీడీడీ-జనసేన కూటమిల మధ్య గట్టి పోటీ ఉండనుంది. మే 13 ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరి ఏపీ ప్రజలు ఈసారి ఎవరికి అధికార బాధ్యతలు అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: జనసేనకు బిగ్ షాక్.. పార్టీ సమన్వయకర్త రాజీనామా..!

Advertisment
తాజా కథనాలు