ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోమో స్పష్టత ఇస్తాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రోజు రోజుకూ బలపడుతోందని, జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని..

New Update
ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోమో స్పష్టత ఇస్తాం: నాదెండ్ల మనోహర్

వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే స్పష్టత ఇస్తామని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ రోజు రోజుకూ బలపడుతోందని, జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు.

వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే చెప్పేస్తామన్నారు. అలాగే తర్వలోనే బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులపై క్లారిటీ వస్తుందని చెప్పారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం హైరదాబాద్ లోని ప్రైవేటు సంస్థలకు ఏపీ ప్రభుత్వం పంపిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. డేటా చోరిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ కేంద్రమే డైరెక్ట్ గా ఈ విషయం చెప్పిందని అన్నారు. ఈ విషయంపై జనసేన ముందే చెప్పిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు నాదెండ్ల.

ఈ ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల పేరుతో ముఖ్యమంత్రికి తెలియకుండా వందల ఫైళ్లు వెళ్లిపోవడం తప్పుకదా? అని మనోహర్ ప్రశ్నించారు. అలాగే వలంటీర్ వ్యవస్త తప్పు చేస్తే ఎవరిని అడగాలి? దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా అని మనోహర్ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే పారదర్శకత ఎక్కడ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు నాదెండ్ల.

అలాగే సీఎంవోలో అక్రమాలు జరిగాయని సీఎం జగన్ ఒప్పుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ చైర్మన్ గా భూమన నియామకం వల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులను డమ్మీలుగా చేసి వలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.

Advertisment
తాజా కథనాలు