No Water For Beers : తెలంగాణ(Telangana) లో మందుకు కరువు రానుంది. మండే వేసవి(Summer) లో మాయిగామందు తాగుదాం అంటే దొరక్కుండా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎల్‌నినో(LNINO), మండే ఎండలు కారణంగా తెలంగాణలో జలాశయాలు ఎండిపోతున్నాయి. మంజీరా, సిగూరు అడుగంటాయి. ఈ నీళ్లు లేకపోవడం బీర్ల తయారీ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎండాకాలంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బీర్ల(Beer) కోసం డిమాండం ఉంది. కానీ అందుకు తగ్గ ఉత్పత్తి మాత్రం అవడం లేదు. దానికి కారణం జలాశయాల్లో నీళ్లు లేకపోవడమే. దీంతో బీర్ల తయారీకి కావాల్సిన వాటర్ సప్లయ్ లేకపోవడంతో బ్రూవరీస్ చేతులెత్తేస్తున్నాయి. తమ వల్ల కావడం లేదని తెలంగాణలోని ప్రధానంగా ఉన్న అయిదు బ్రూవరీస్ తేల్చేశాయి.
అన్ని నీళ్ళు ఇవ్వలేం..
బీర్ల తయారీ కంపెనీ(Beer Factory) లకు రోజుకు 44 లక్షల లీటర్ల నీళ్ళు ఖర్చు అవుతుంది. అయితే బీర్ల కంపెనీలకు ఇన్ని నీళ్లు సప్లయ్ చేయడం కుదరడం లేదు. ఈ విషయం స్వయంగా వాటర్ బోర్డ్ అధికారులు చెప్పారు. సిటీకి కావాల్సిన తాగునీరు అందివ్వాల్సిన పరిస్థితుల్లో బీర్ల తయారీకి నీరు ఇవ్వబోమని అధికారులు అంటున్నారు. దీంతో రానున్న మూడు నెలలు బీర్ల తయారీపై ప్రభావం పడనుంది. ఇక ఈ నెలలో ఇప్పటికే 48,71,668 పెట్టెల బీర్ విక్రయాలతో దాదాపు ₹1458కోట్ల రాబడిని ఆబ్కారీ శాఖ నమోదుచేసుకున్నట్టు సమాచారం.
రాష్ట్ర ఖజానాకు గండి..
బీర్ల తయారీ ఆగిపోతే ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు భారీగానే గండి పడనుంది. గత నాలుగేళ్ళుగా ఎప్పుడూ రాని రీతిలో బీర్ ఉత్పత్తికి నీరు కరువు ఏర్పడుతోందని వాటర్ బోర్డ్ చెబుతోంది. దీని కారణంగా ఖజానాకు ₹1200కోట్ల రాబడి తగ్గిపోయే పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1999 తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడే ఏర్పడిందని చెబుతున్నారు అధికారులు. ఇక తెలంగాణలో బ్రూవరీలు ఆగిపోతే అది పక్క రాష్ట్రాలకూ దెబ్బే కానుంది. ఎందుకంటే ఈ నాలుగు పెద్ద కంపెనీల బ్రూవరీలు తమ ఉత్పత్తులను తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఇతర పొరుగు రాష్ట్రాలకు సప్లయ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతీనెల 40 నుంచి 60లక్షల పెట్టెల బీర్ విక్రయాలతోపాటు మరో 13 లక్షల పెట్టెల బీర్ పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.
Also Read : Gold rates : 70వేల మార్క్‌ను దాటేసింది..ధగాధగా బంగారం..భగాభగా