/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/robo-aish-saudi-arabia-jpg.webp)
Saudi Arabia First Male Robot Touches Female Reporter : ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషుల్లా కనిపించే రోబోలు తయారవుతున్నాయి. అయితే ఇప్పుడు రోబో(Robo) లను తయారు చేయడం నిజంగా మనుషులకు సరైనదా కాదా అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తాయి. ఇటీవల సౌదీ అరేబియా(Saudi Arabia) తన మొదటి మగ ఆండ్రాయిడ్ రోబోట్‌ను లాంచ్ చేసింది. ఈ రోబోకు మహమ్మద్ అని పేరు పెట్టారు. లాంచ్ అయిన వెంటనే ఈ రోబో చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోబో మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకినట్లు కనిపించింది.
Saudi Arabia unveils its man shaped AI robot Mohammad, reacts to reporter in its first appearance pic.twitter.com/1ktlUlGBs1
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 6, 2024
రోబో సినిమా గుర్తొచ్చింది:
ప్రముఖ దర్శకుడు శంకర్(Shankar), సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కాంబోలో వచ్చిన రోబో మూవీ గుర్తింది కదా.. అందులో రోబోగా చిట్టీ పాత్రలో రజనీకాంత్ ఇరగదీశాడు. ఐశ్వర్యరాయ్‌ని లవ్ చేస్తూ విలన్‌లా మారిపోతాడు. ఈ వీడియో చూసిన ఇండియన్ సినీ లవర్స్ రోబో సినిమాను గుర్తు చేసుకున్నారు.
ఏం చేసింది?
ఒక మహిళా రిపోర్టర్ ఈ రోబో దగ్గర నిలబడి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు, రోబో ఆమెను అనుచితంగా తాకినట్లు కనిపించింది. రోబో హఠాత్తుగా టచ్ చేయడంతో మహిళా రిపోర్టర్ భయపడిపోయింది. అయితే ఈ ఘటన తర్వాత ఆమె తన రిపోర్టింగ్‌ను కొనసాగించింది. రోబో చర్య కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియా(Social Media) లో దుమారం రేపింది. చాలా మంది రోబో చేతి కదలికలను 'సహజంగా' గుర్తించారు. మరికొందరు రోబోను ఈ విధంగా రూపొందించిన ప్రోగ్రామర్‌లను ప్రశ్నించారు. ఇక రోబో ప్రోగ్రామింగ్‌లో ఏదో సమస్య కారణంగానే ఇలా జరిగినట్టు తెలుస్తోంది.
Also Read : ఏనుగుపై ప్రధాని రయ్‌రయ్.. మోదీ స్వారీ మాములగా లేదుగా!