Mukesh Ambani : అంబానీ ఇంటి పై ''జై శ్రీరామ్‌'' వెలుగులు..!

అయోధ్య రామ మందిర వేడుకలు దేశంలోని పలు ప్రాంతాలు ప్రత్యేకంగా అలంకరం అవుతుండగా..వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ప్రత్యేక అలంకరణతో ముస్తాబు అయ్యింది. ఆయన ఇంటి పై '' జై శ్రీరామ్‌'' అనే నినాదాలు కనిపించాయి.

New Update
Mukesh Ambani : అంబానీ ఇంటి పై ''జై శ్రీరామ్‌'' వెలుగులు..!

Ayodhya Ram Mandir : అయోధ్య(Ayodhya) రామ్‌ లల్లా(Ram Lalla)  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ క్రమంలోనే భారత దేశ వ్యాప్తంగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రామ నామ స్మరణ ఎక్కడ చూసిన కనిపిస్తుంది, వినిపిస్తుంది. ప్రతి హిందువు కూడా తమ రామ భక్తిని చాటుకుంటున్నారు.

కేవలం భారత్(Bharat) లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా కూడా రామ నామ స్మరణతో హోరెత్తిస్తున్నారు. అమెరికాలో 200 టెస్లా కార్ల(Tesla Cars) తో రామ్‌ అనే నామాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర(Maharashtra) లో 33 వేల దీపాలతో సియావర్‌ రామచంద్రకీ జై(Siyavar Ramchandra ki jai)  అంటూ రాసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

అంబానీ ఇంటి పై ''జై శ్రీరామ్‌''..

ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani) కూడా రామ భక్తిని చాటుకున్నారు. ఆయన నివాసం అయినటువంటి ' ''ఆంటిలియా ''(Antilia) ను జై శ్రీరామ్‌(Jai Sri Ram) నామాలతో అందంగా అలంకరించారు. శనివారం సాయంత్రం ఆయన ఇంటి పై '' జై శ్రీరామ్‌'' అనే నినాదాలు కనిపించాయి.

రామునికి స్వాగతం పలికేందుకు...

ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అంబానీ ఇంటిని పూల బొకేలు, రంగురంగుల దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆంటిలియాలో ఉన్న రామాలయాన్ని అంబానీ కుటుంబం ప్రత్యేకంగా అలంకరించింది. అంతేకాకుండా ఆంటిలియాలోని ఇతర ప్రాంతాలను కూడా రామునికి స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా అలంకరించారు.

27 అంతస్తుల ఇంట లోపల, వెలుపల కూడా హిందూ మతతత్వం ఉట్టిపడేలా శ్రీరామునికి చెందిన చిహ్నాలు, చిత్రాలు ఏర్పాటు చేశారు. అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తమ కుటుంబం మొత్తం ఎంతో ఉత్సాహం గా ఉందని అంబానీ కుటుంబం తెలిపింది.

ఈ చారిత్రాత్మక ఘట్టంలో తాము కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంబానీ ఫ్యామిలీ తెలిపింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందుకున్న వారిలో ముఖేష్‌ అంబానీ కూడా ఒకరు. అంబానీ ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకానున్నారు.

Also read: 33 వేల దీపాలతో ”సియావర్‌ రామ్‌చంద్రకీ జై” ..గిన్నిస్‌ రికార్డు!

Advertisment
తాజా కథనాలు