ఈమధ్యకాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. మొన్న హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై వేటు వేసింది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజీ వార్తల్లో నిలిచింది. కొంతమంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ రచయిత్రి, సీఎం సోదరి గీతా మెహతా మృతి, ప్రధాని సంతాపం..!!
మెడికల్ కాలేజీ విద్యార్థులు ఈనెల 14వ తేదీని కొట్టుకున్నారు. ఆ రోజు కాలేజీలోని మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థిని వేధింపులు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులు దాడి చేయడంతో సదరు విద్యార్థికి గాయాలు అయ్యాయి. వెంటనే బాధితుడు మట్టెవాడ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆరుగురు సీనియర్ విద్యార్థులపై శనివారం కేసు నమోదు చేశారు. అయితే ఇది ర్యాగింగ్ కాదని..విద్యార్థుల మధ్య గొడవ మాత్రమేనని మెడికల్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. ఈ ఘర్షణ కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులను కాలేజీకి పిలిచామని తెలిపారు. ఈ ఘటన గురించి ర్యాగింగ్ నిరోధఖ కమిటీలో చర్చిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీని ఏయే దేశాలు అత్యన్నత గౌరవంతో సత్కరించాయో తెలుసా?