TG Second Capital: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

గొప్ప చారిత్రక నేపథ్యమున్న ఉమ్మడి వరంగల్ ను తెలంగాణ రెండో రాజధానికి అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్ ​వరంగల్‍ సుందరీకరణలో భాగంగా 3 నెలల తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయబోతున్నట్లు కొండా సురేఖ తెలిపారు.

TG Second Capital: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
New Update

Warangal: తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా (Second Capital Of Telangana) ఉమ్మడి వరంగల్‌ను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గొప్ప చారిత్రక నేపథ్యమున్న వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీని రెండో రాజధానిగా పరిగణించాలని ఉమ్మడి జిల్లా తరఫున సీఎం రేవంత్‍రెడ్డిని (CM Revanth Reddy) కోరతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, గ్రేటర్‍ కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే తదితరులతో హనుమకొండ కలెక్టరేట్​ లో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలు, గ్రేటర్‍ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులు, పెండింగ్‍ ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చించారు.

మూడు నెలల తర్వాత మాస్టర్ ప్లాన్..

ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు. ఈ సంరద్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని చెప్పారు. మామునూరు ఎయిర్ పోర్ట్, వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. మూడు నెలల తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేసే అంశం ఉంటుందని సురేఖ తెలిపారు. అలాగే మామునూరు ఎయిర్ పోర్ట్ అంశం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్ రింగ్ రోడ్ పనులు, మహిళా శక్తి రుణాలకు సంబంధించిన ఫండ్స్ రూ.20 కోట్లు రేపు మంజూరు చేయబోతున్నట్లు చెప్పారు. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు కూడా సీఎం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ ఆవరణలో అవసరానికి మించి 24 అంతస్తుల హాస్పిటల్‍ నిర్మాణం ప్రారంభించిందని, వైద్య సేవలకు 12 అంతస్తులు సరిపోతాయని, వీలైనంత త్వరగా దాన్ని ఓపెన్‍ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు.

అలాగే అండర్‍గ్రౌండ్​ డ్రైనేజీ, మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​, ఔటర్‍, ఇన్నర్‍ రింగురోడ్లు, ఇండస్ట్రీయల్‍ కారిడార్​ స్మార్ట్​సిటీ ప్రాజెక్టులను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ లేదంటే బడ్జెట్‍లో ఎక్కువ నిధులు కేటాయించాలని అడుగుతామన్నారు. అలాగే మామునూర్‍ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు రైతులు, జీఎంఆర్‍ సంస్థ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం, ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు ఆర్థిక సాయం, వరంగల్‍ బస్టాండ్‍కు నిధులు, కార్పొరేషన్‍ బిల్డింగ్‍ నిర్మాణం, వెటర్నరీ యూనివర్సిటీ, ఆయుర్వేదిక్‍ హాస్పిటల్‍, స్టేడియం నిర్మాణం, దేవునూర్‍ గుట్టలపై టూరిజం, ఫోర్ట్ ​వరంగల్‍ సుందరీకరణ, ఎంజీఎంలో సమస్యలను సీఎంతో చర్చించి కావాల్సిన ప్రపోజల్స్​ అందించనున్నట్లు సురేఖ వివరించారు.

Also Read: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ?

#telangana #warangal #second-capital
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe