YCP Flexi Issue : అమలాపురంలో ఫ్లెక్సీల వార్.. వైసీపీ ఆగ్రహం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వార్ నడుస్తోంది. అమలాపురం సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీలు వార్ నెలకొంది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించపోవటంతో ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. By Vijaya Nimma 10 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి YCP Flexi Issue : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిచి.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లా కేంద్రం అమలాపురం వస్తున్న సీఎం పర్యటనకు ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. సీఎం సభలో సుమారు లక్ష మంది పాల్గొనేలా ఏర్పాటు చేశారు. తొలుత సభావేదిక వద్ద ముందస్తు భద్రతా తనిఖీ నిర్వహించారు వైసీపీ నేతలు. Your browser does not support the video tag. ఈ నేపథ్యంలో అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. అమలాపురంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించక పోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ కుమారులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు అమలాపురం సీఎం జగన్ రాకతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ ఆదేశించిన డిజైన్లు కాకుండా సొంత డిజైన్లతో మంత్రి కుమారులు ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంతో సీఎం పర్యటన పరిశీలకులు తలశిలా రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేయడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. గత కొంతకాలంగా మంత్రి కుమారులు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మొన్న అమలాపురం ఎంపీ అనురాధ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరల ఇప్పుడు మంత్రి కుమారులు సాక్షాత్తు మంత్రి అయిన తండ్రి ఫోటోనే లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జిల్లాలో గరంగరంగా ఉంది. Your browser does not support the video tag. ఏపీలో పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రభుత్వమే భరించి, ఆ వడ్డీ డబ్బులను రేపు (శుక్రవారం) నేరుగా మహిళల ఖాతాలలో జమ చేయనుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు సంభంధించిన 10 లక్షల రుణ ఖాతాల వడ్డీ మొత్తం రూ.1,353.76 కోట్లను ప్రభుత్వం ఆ మహిళలకు అందజేయనుంది. లబ్దిదారులైన వేలాది మంది మహిళల సమక్షంలో బటన్ నొక్కి వడ్డీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. Also Read: మూడో విడత వారాహి యాత్రకు విశాఖ చేరుకున్న పవన్ #ambedkar-konaseema-district #ysrcp #amalapuram #ycp-flexi-war #cm-jagan-visit-to-amalapuram #ycp-flexi #ysjagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి