Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె తండ్రి స్పందించారు.తన కూతురు చివరిసారిగా పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.డాక్టర్ అయ్యేందుకు ఆమె చాలా కష్టపడిదంటూ వాపోయాడు. నిందితులకు వెంటనే మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. By B Aravind 16 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మృతిరాలి తండ్రి ఓ జాతీయ మీడియాతో తన కూతురుకి సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన కూతరు చివరిసారిగా డైరీలో.. పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. '' నా కూతురుకు చదుకోవడం అంటే చాల ఇష్టం. ప్రతిరోజూ 10-12 గంటల పాటు చదివేది. రోజంతా పుస్తకాల్లోనే మునిగితేలిది. ఆమె డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా కష్టపడింది. మా కూతురుని పోషించేందుకు మేమూ ఎన్నో త్యాగాలు చేశాం. కానీ ఇప్పుడంతా నాశనమైపోయింది. Also Read: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు నా కూతురు ఇప్పుడు తిరిగి రాలేదు. దేశవ్యాప్తంగా నా కూతురి పట్ల వస్తోంది. న్యాయం కోసం పోరాడేందుకు ఇది మాకు ఎంతో ధైర్యాన్నిస్తోంది. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ నేరానికి పాల్పడ్డ నిందితులకు మరణశిక్ష వేయాలి. ఎంత తొందరగా వాళ్లని శిక్షిస్తే అంత మంచింది. దీనివల్ల మాకు కొంత ఊరట లభించినా.. మా కూతురిని కోల్పోయామనే బాధ ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. నా కూతురికి ఆ మెడికల్ కళాశాల యాజమాన్యం సపోర్ట్ చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏ పార్టీ నుంచి కూడా రాజకీయ ఒత్తిడి రావడం లేదంటూ' మృతిరాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలాఉండగా.. ఆగస్టు 9న ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రిలో పోస్ట్‌గ్రాడ్యూయేట్ చదువుతున్న ట్రైనీ డాక్టర్ రాత్రి విధుల్లో ఉంది. ఉదయం చూసేసరికి సెమినర్ హాల్‌లో ఆమె అర్థనగ్న స్థితిలో విగతజీవిగా పడి ఉంది. ముందుగా కళాశాల యాజమాన్యం ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. చివరికి పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్ రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కోల్‌కతా పోలీసులతో కలిసి సివిక్ వాలీంటీర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో జస్టీస్ ఫర్ నిర్భయ 2 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నిందితుడికి వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు చేస్తున్నారు. Also Read: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల #telugu-news #national-news #kolkata-doctor-case #rape-and-murder మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి