Walking With Barefoot: చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

చెప్పులు లేకుండా నడవడం అనేది ప్రస్తుత కాలంలో కొంత కష్టమైన పని. అయితే రోజులో ఒక్కసరైనా చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి మంచిది. ఇలా నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది. మంచినిద్ర పడుతుంది. కాళ్ల కండరాలను మెరుగుపడతాయి.

Walking With Barefoot: చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
New Update

Walking With Barefoot: ప్రస్తుత జీవితంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉరుకుపరుగుల జీవితంలో కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు నుంచి దూరం అవ్వచ్చు. నేటి కాలంలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది ప్రస్తుతం రోజువారి వ్యాయామంలో వాకింగ్‌ తప్పనిసరిగా చేస్తున్నారు. అయితే.. ఇలా నడిచేటప్పుడు చెప్పులు, బూట్లు కచ్చితంగా వేసుకుంటారు. కానీ.. ఈ రెండింటికి బదులు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. నేలపై చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్పులు లేకుండా నడిస్తే భూమి శక్తితో అనుసంధానం అయి శరీరం విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, కండరాలకు మెరుగు పరుస్తుందని డాక్టర్లు అంటున్నారు. అయితే.. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం.

చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజులు

ఒత్తిడి తగ్గిస్తుంది: చెప్పులు లేకుండా నడవడం వలన మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనను తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

మంచి నిద్ర: మంచి నిద్ర కోసం చెప్పులు లేకుండా నడవాలి. గ్రౌండింగ్ ప్రాక్టీస్ వలన మానసిక ఆరోగ్యంతో పాటు శరీరానికి మరింత విశ్రాంతినిస్తుంది. దీని వలన మంచిగా నిద్రపోతారు.

కాళ్లను బలపరుస్తుంది: చెప్పులు లేకుండా నడవడం వల్ల మన కాళ్ల కండరాలు బలపడి, చీలమండపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా పాదాల పరిస్థితి మెరురుపడి తుంటి, మోకాళ్లు, వీపులో నొప్పి నుంచి దూరం చేస్తుంది.

ఇంద్రియ నాడులు: బూట్లు, చెప్పులతో నడిచినప్పుడు పాదాలలోని ఇంద్రియ నాడులు తక్కువగా పనిచేస్తాయి. అయితే.. పాదాల్లోని ఇంద్రియ నాడులు ఉత్తేజితంగా ఉండాలంటే చెప్పులు లేకుండా నడవాలి.

ఇలా చేయాలి: చెప్పులు లేకుండా నడవాలి అనుకునేవారు రోజు 10 నుంచి 15 నిమిషాలు నడవడం ప్రాక్టీస్‌ చేయాలి. అదికూడా మంచి శుభ్రమైన ప్రదేశం, చెత్తా చెదారం లేని స్థలంలో నడవడం ఉత్తమం. మన పాదాలు మృదువృగా ఉంటాయి కాబట్టి పాదాలకు గాయాలు కాకుండా నెమ్మది నడిచేలాగా ప్లాన్‌ చేసుకోవాలి.

వ్యాయామం: మన కాళ్ళను బలోపేతం చేయడానికి ప్రతీరోజూ వ్యాయామం చేస్తే కాలు కండరాలను బలపరిచి, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

ఇది కూడా చదవండి: బాలిక శరీరంపై రామ్‌, రాధ అక్షరాలు..చూస్తుండగానే మాయం

#tips #health-benefits #walking-with-barefoot
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe