Drinking Water : చాలా మంది ఆహారం తినడానికి కూర్చుంటే కచ్చితంగా నీరు పక్కన ఉండాల్సిందే. నీరు పక్కన లేకపోతే చాలా మంది ముద్ద నోటిలో పెట్టరు. కొందరు ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు(Drinking Water). కానీ ఈ నీరు తాగే విధానమే మనకి హానికరమని ఆరోగ్య నిపుణులు(Health Professionals) చెబుతున్నారు. సరైన సమయంలో నీరు తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి బదులు దానిని చెడగొట్టవచ్చు.
తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని అనేక ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి, ఆహారం తిన్న తర్వాత 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం!
ఆహారం తిన్న 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు అంటే?
ఆహారం(Food) తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ(Digestion) సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతేకాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది. ఇది పిండి పదార్ధాల జీర్ణక్రియ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఇవన్నీ పొట్టలో ఎక్కువ సేపు ఉండి అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత నీరు తాగాలి. దీని వల్ల జీర్ణక్రియ చర్యలు సక్రమంగా ఉంటాయి.
ఈ విధంగా నీరు తాగటం వల్ల ఆహార పైపు, కడుపు, పేగుల పనితీరును కూడా ప్రభావితం చేయకుండా ఉంటుంది. 30 నిమిషాల తరువాత నీరు తాగడం వల్ల ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో కానీ, జీర్ణం చేయడంలో కానీ సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా ముఖ్యం. ఆహారం తిన్న 30 నిమిషాల తరువాత నీరు తాగడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు.
Also Read : రెండో బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా?