Vv Vinayak::ఓటిటిలపై సంచలన కామెంట్స్ చేసిన వివి వినాయక్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వి వి వినాయక్. ఫస్ట్ మూవీ ఆది నుంచి మొన్నటి హిందీ చత్రపతి వరకు వినాయక్ మార్క్ తో మాస్ ను అలరించారు. చాలా రోజుల తరువాత సినిమాలను మింగేస్తున్న ఓటిటిల గురించి , ఫెయిల్ సినిమా చేసిన దర్శకుల గురించి హాట్ కామెంట్స్ చేసారు. By Nedunuri Srinivas 04 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vv Vinayak::అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అంటూ ఓ కొత్త హీరోతో ఓ కొత్త డైరెక్టర్ చెప్పిస్తే ప్రేక్షకులకు కాస్త వేటకరంగానే ఉంటుంది . కానీ..ఈ డైలాగు ఓ పవర్ ఫుల్ యాక్షన్ జానర్ లో చెప్పించి టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు చిరునామా నిలిచిన మాసివ్ డైరెక్టర్ వి వి వినాయక్. తొలి సినిమా ఆది మూవీ తోనే బాక్స్ ఆఫీస్ షేక్ చేసి అందరి దృష్టి తన వైపు తిపుకున్నారు వినాయక్.తన కెరీర్ లో అదుర్స్, టాగూర్, లక్ష్మి, ఖైదీ నంబర్ 150 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన వినాయక్ ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోవడం వినాయక్ మార్క్ సినిమాల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది... ఓటిటిల వల్ల ఆలోచనా పరిధి తగ్గింది..సినిమాకు ఓటిటీ శత్రువులా మారింది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్,, సినిమా కథల ఆలోచనా విధానం అప్పట్లో ఎలా ఉండేది ..ఇప్పుడు ఎలా ఉందో ఓ ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడం జరిగింది.ఓటిటి ల వల్ల క్రియేటర్స్ ఆలోచనా విధానం చిన్నగా అయిందని. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకు ఓటిటీ శత్రువులా మారిందని అన్నారు. సినిమా జయాపజయాలకు భాధ్యత ఒక్క దర్శకుడే కాదు సినిమా జయాపజయాలకు దర్శకుడు ఒక్కడినే బాధ్యులను చేస్తున్నారని..ఈ విధానం తప్పు అని అన్నారు.ఓ కథ అందరూ అంగీకరించిన తరువాతే సెట్స్ మీదకు వెళ్తుందని,, తీరా ఫెయిల్ అయితే మొత్తం దర్శకులే బాధ్యులు అవుతున్నారని ఆన్నారు. కథ కుదిరితే సినిమా చేస్తా ఇక..తనకు మంచి కథ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తానని,అది ఎప్పుడో తెలియదని అన్నారు. కుదిరితే అదుర్స్ 2, టాగూర్ 2 లాంటి సినిమాలు కూడా తీయోచ్చని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్స్ దగ్గర సందడి గా ఉండేదని ,ఇప్పుడు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నా సరే సినిమా హాల్లో జనాలు ఉండటం లేదనీ అన్నారు. ముఖ్యంగా సినిమా అపజయం మొత్తం డైరెక్టర్ పైనే వేసి నిందించడం సరికాదన్న వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. #jr-ntr #megastar-chiranjeevi #ott-platforms #vvvinayak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి