Vizag Man Commits Suicide: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్‌(30) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే డబ్బులు సర్దుబాటు కాక సమయానికి డబ్బులు కట్టలేకపోయాడు. కొంత మొత్తమే తిరిగి చెల్లించాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం హేమంత్ మృతిపై తండ్రి గున్న శ్రీనివాసరావు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!
New Update

Vizag Man Commits Suicide due to Loan Apps Harassment: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. యాప్‌ లో తీసుకున్న డబ్బులు చెల్లించినా సరే టార్చర్ చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకూ ఈ లోన్‌ యాప్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి జరిమానా పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నారు. తాజాగా ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా మరో యువకుడు బలయ్యారు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి నెట్ ‌లో పెడతామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో విశాఖ పట్నంలోని కంచరపాలెంకు చెందిన గున్న హేమంత్(30) ఉరి వేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్‌(30) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే డబ్బులు సర్దుబాటు కాక సమయానికి డబ్బులు కట్టలేకపోయాడు. కొంత మొత్తమే తిరిగి చెల్లించాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు.

కానీ ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. వెంటనే బాకీ చెల్లించాలని, లేదంటే తమ వద్దనున్న మీ ఫొటోలన్నీ నెట్‌లో పెడతామని, మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు కొంత సమయం ఇవ్వాలని చెప్పినా.. వారు వినిపించుకోలేదు. రోజురోజుకూ ఎక్కువగా వేధించడం స్టార్ట్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకన్నాడు.

బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం హేమంత్ మృతిపై తండ్రి గున్న శ్రీనివాసరావు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#andhrapradesh #visakha-district #loan-apps-harassment #man-commits-suicide #vizag #visakhapatnam #crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe