Vivek Venkataswami into Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీని (BJP) వీడి కాంగ్రెస్‌లో (Congress) చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీని (Rahul Gandhi) కలవనున్న వివేక్ రాత్రి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి వివేక్ చేరిక పూర్తయ్యాక.. రేపు ఉదయం కాంగ్రెస్ పెండింగ్ లిస్ట్ విడుదల చేస్తుందన్న ప్రచారం సాగుతోంది.
Also Read: రాయగడ-పలాస రైలు ప్రమాదానికి కూడా కారణం కవచ్ సిస్టమే లేకపోవడమే.
శనివారం రాత్రి పీసీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో భేటీ తర్వాత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ ను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరగా.. ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. చెన్నూరు నుంచి వివేక్ కుమారుడితో పోటీ చేయించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం జరిగే ఎంపీ ఎన్నికల్లో వివేక్ కు పెద్దపల్లి టికెట్ ఇవ్వడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైతే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సీటును కమ్యూనిస్టులకు ఇవ్వాలని మొదట కాంగ్రెస్ భావించింది. అయితే.. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో బలమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావించిన కాంగ్రెస్ వివేక్ ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపింది. వ్యూహం ఫలించడంతో ఆయన నేడు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.