/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-41-jpg.webp)
Star Director : బాలీవుడ్(Bollywood) స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన.. మరో కాంట్రవర్సీ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ మేరకు ‘ది ఢిల్లీ ఫైల్స్’ మూవీని వచ్చే సంవత్సరం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు.
BIG ANNOUNCEMENT:
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA - AN EPIC TALE OF DHARMA.There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.
1/2 pic.twitter.com/BiRyClhT5c
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023
కంటెంట్ మాత్రం చాలా పెద్దది..
ఈ మేరకు ‘కొన్నేళ్లనుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం మొదలుపెట్టాను. ఫస్ట్ మూవీ ‘ది తాష్కంట్ ఫైల్స్‘తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నా. రెండోది ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇక మూడోది ‘ది ఢిల్లీ ఫైల్స్’(The Delhi Files). ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు. కంటెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు కూడా అభిషేక్ అగర్వాలే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వివేక్ ‘పర్వ’ మూవీతో బిజీగా ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.