Gaami First Look: అఘోరగా విశ్వక్‍సేన్ .. గామి ఫస్ట్ లుక్ పోస్టర్

విశ్వక్‍సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో అఘోరగా కనిపిస్తున్న విశ్వక్‍సేన్ డిఫరెంట్ లుక్ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది.

Gaami First Look: అఘోరగా విశ్వక్‍సేన్ .. గామి ఫస్ట్ లుక్ పోస్టర్
New Update

Vishwak Sen Gaami First Look: విద్యాధర్ కగిట దర్శకత్వంలో మాస్ కా దాస్ యంగ్ హీరో విశ్వక్‍సేన్ (Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామి. సెల్యులాయిడ్ బ్యానర్ పై కార్తీక్ శబరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందిని చౌదరి (Chandini Chowdary), ఎంజీ అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం కోసం గత నాలుగేళ్లుగా పని చేస్తున్నట్లు ఇటీవలే హీరో విశ్వక్‍సేన్ తెలిపారు. డిఫరెంట్ కథనంతో రూపొందుతున్న గామీ పై విశ్వక్‍ భారీ ఆశలు పెట్టున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

విశ్వక్‍సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్

ఈ చిత్రం నుంచి మేకర్స్ .. విశ్వక్‍సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "ఇది ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ.. అతి పెద్ద భయాన్ని జయించేందుకు అతడి ప్రయాణం" అంటూ ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ను షేర్ చేశారు.

పోస్టర్ లో విశ్వక్ అఘోరాగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేసింది. "మానవ స్పర్శే అతడి అతి పెద్ద భయం.. అతడి అమితమైన కోరిక కూడా మానవ స్పర్శే" అని ఈ పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ తో స్టోరీ ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అఘోరాగా కనిపిస్తున్న విశ్వక్ ను కొన్ని చేతులు పట్టుకోవడానికి వస్తున్నట్లుగా పోస్టర్ ఉంది.

Also Read: Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

publive-image

ప్రస్తుతం మాస్ కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బిజీగా ఉన్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథానాయికగా నేహా శెట్టి, నాజర్, అంజలి, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష చైతన్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

#vishwak-sen #vishwak-sen-latest-movie #gaami-first-look #vishwak-sen-gaami-first-look-poster
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe