Trisha: ప్రముఖ రాజకీయవేత్త ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ నటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రిష పై అభ్యంతరకరంగా కామెంట్స్ చేయడంపై ఫిలిం ఇండస్ట్రీలో అందరూ మండిపడుతున్నారు. ఈ ఇష్యూపై నటుడు విశాల్ తనదైన స్టైల్ లో స్పందించారు. ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచేందుకు సినీ తారలతోపాటు పలువురు సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఒక ట్రెండ్ గా మారిందన్నారు. ఇలాంటి పాడు పనులు కాకుండా జీవితానికి ఉపయోగపడే ఉద్యోగం చేసుకోవాలంటూ ఏవీ రాజు పేరు ఎత్తకుండా చురకలంటించారు.
నిజంగా బాధగా ఉంది..
ఈ మేరకు విశాల్ మాట్లాడుతూ.. 'ప్రముఖులపై తప్పుడు ప్రచారం, నెగెటీవ్ కామెంట్స్ చేయడం కొందరికీ ఒక ట్రెండ్ గా మారింది. ఏదైనా జాబ్ చేసుకోవాలి కానీ ఇలాంటి కామెంట్స్ చేస్తూ పేరు సంపాదించాలనుకోవడం సరైనది కాదు. ఒక రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఆరోపణలు చేశారని విన్నాను. అది పబ్లిసిటీ కోసమే అని బాగా తెలుసు. ఇలాంటి వాటిపై మాట్లాడుతున్నందుకు నిజంగా బాధగా ఉంది. మీరు టార్గెట్ చేసినవారు.. నేనూ ఒకే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లం. మంచి స్నేహితులం. అందుకే మీ పేరు, మీ ఆరోపణలు, వివరాలను ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఒకరి పర్సనల్ లైఫ్ పై కాంట్రవర్సీ గా మాట్లాడినందుకు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కాదు ఒక మనిషిగా చెబుతున్నా' అంటూ విశాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇది కూడా చదవండి: Singareni: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయండి.. భట్టి విక్రమార్క ఆదేశాలు
అసలేం జరిగిందంటే..
ఒక కార్యక్రమంలో ఏవీ రాజు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. త్రిష ఖండించింది. 'అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూడటం అసహ్యంగా అనిపిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సారి సమాధానం లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తుంది' అంటూ ట్వీట్ చేస్తూ అతన్ని హెచ్చరించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.