తెలుగు భాషపై పట్టు సరించే దిశ..
అధికార భాష సంఘం అధ్యక్షుడు పి. విజయబాబు విశాఖ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు భాషపై ఆయా జిల్లాలో పర్యటిస్తూ.. జిల్లాలో ఉన్న అధికారులను పాలన వ్యవహారాలు గురించి ఏ స్థాయిలో ఉంది.. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి..? ఇబ్బందులు ఎలా అధిగమించాలి..? అనేటువంటి విషయాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రచయితలతో కూడా సమావేశాలు, గోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయబాబు వెల్లడించారు. ఇలా చేసుకుంటూ విశాఖలో ఈరోజు తాపీ ధర్మారావు జయంతి సందర్భంగాను, రేపు గురజాడ జయంతి సందర్భంగా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే..
తెలుగు భాషపై పట్టు
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పి.విజయబాబు కామెంట్స్ చేశారు. తెలుగు భాష అమలుపై జిల్లా వారీగా పర్యటన చేస్తున్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం అధ్యపకులతో చర్చించడం జరుగుతుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యార్థులు తెలుగు మర్చిపోతున్నారని కొంత మంది అంటున్నారు. రాష్ట్రంలో ఆంగ్ల బాషాపై విద్యార్థులకి పట్టు పెరుతుందన్నారు. ఆంగ్లంతో పాటు తెలుగు భాషపై పట్టు సరించే దిశగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
జయప్రదం చెయాలని విజ్ఞప్తి
గత ప్రభుత్వంలో తెలుగు భాషా సంఘం ఏర్పాటు కాలేదు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ ద్వారా యూవత ప్రపంచ స్థాయి గుర్తిపు వచ్చిందన్నారు.
గిడుగు, తాపీ ధర్మారావు లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన నేల మనది. సాహిత్యం, ఉద్యమ స్ఫూర్తి ఉత్తరాంధ్రలో అధికం. విశాఖలో నిర్వహించే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్‌ని కలుస్తాం అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. సాంస్కృతిక సాహిత్యంపై గురజాడ కార్యక్రమంతో పాటు గుర్రం జాషువా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న సాహిత్య కార్యక్రమాలను అందరు జయప్రదం చెయాలని ఆయన విజ్ఞప్తి చేశారు
సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు కమిటీ
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో ప్రతి చోట ద్విబాషా సూత్రం అమలు చెయ్యాలి. కోర్టులో వచ్చే తీర్పు కూడా తెలుగులో ఇస్తే సాంకేతిక ఇబ్బందు ఉంటాయన్నారు. కోర్టులో వచ్చే సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఒక కమిటీ వేస్తామన్నారు. విశ్వవిద్యాలయలే తెలుగు సాహిత్యంనికి దేవాలయలు అందుకే అక్కడే ఫోకస్ పెట్టడం జరుగుతోందని ఆయన వివరించారు.