జగన్‌ పాదం పెడితే..విశాఖ సర్వనాశనం!

జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.

New Update
జగన్‌ పాదం పెడితే..విశాఖ సర్వనాశనం!

జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.

వైసీపీ మంత్రులు జగన్ ని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరునితో పోల్చడం చాలా విడ్డూరంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ పై సీఎం జగన్‌ ఇల్లు ఉంటే తప్పేంటి..దేవుళ్లు కొండ మీదనే ఉంటారంటూ మంత్రి రోజా, కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు.

టీటీడీ చైర్మన్‌ పదవి ఉన్నంత వరకు కొంత ఆచితూచి మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి పదవిపోయిన తరువాత మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నారన్నారు.రుషికొండపై నిర్మాణాలు సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని, దాన్ని కప్పిపుచ్చడానికి అడ్డగోలు సమాధానాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఎంపీ ఎంవీవీ అక్రమ ఆస్తులపై విచారణ చేపట్టి అతనిపై రౌడీషీట్‌ తెరుస్తామన్నారు. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం కడుతున్నామని తొలుత చెప్పిన ప్రభుత్వం.. ఆ తరువాత కాదని మాట మార్చిందన్నారు

విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టాడానికి ముఖ్య కారణం ఏంటంటే..ఆయన విశాఖలో దోచుకున్న దాంట్లో పావలా సీఎంకు ఇచ్చి, మిగిలినది ఆయన జేబులో వేసుకున్న విషయాన్ని ఎంపీ నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

అందుకే విజయసాయిని పక్కనపెట్టారని, ఇప్పుడు ఎంపీ విశాఖను దోచుకోవడం ప్రారంభించి ముప్పావలా తాడేపల్లికి ఇచ్చి, పావలా తాను తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రిని గద్దె దించడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కలిసి పోరాటం చేస్తున్నారన్నారు.

Advertisment
తాజా కథనాలు