Virat Kohli : విరాట్ కోహ్లీ... ఇండియన్ క్రికెట్ ఆణిముత్యం. క్రికెట్‌లో కింగ్ కోహ్లీ(Kohli) అనిపించుకున్నాడు. వరల్డ్ కప్(World Cup) లో ఇండియా ఓడిపోయినా అత్యద్భుత ప్రదర్శనతో కోహ్లీ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ళల్లో ఒకడైన విరాట్ ఖాతాలో ఇప్పటికే చాలా రికార్డ్‌లు, ఘనతలూ, అవార్డులు, వివార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త గా మరో ఘనత వచ్చి చేరింది.ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు.అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.
Also Read:అరుదైన సగం మగ, సగం ఆడ పక్షిని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్యుబిటీ(Pubity) అనేది ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న పేజి. దీనిని 35 మిలియన్ల కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. దీని అనుబంధ సంస్థ ప్యుబిటీ స్పోర్ట్ ఈ అవార్డును అందిస్తుంది. ౨౦౨౩లో ప్రపంచవ్యాప్తంగా అన్ని స్పోర్ట్స్‌లో అత్యుత్తమ ఆటగాళ్ళు దీనికి పోటీ పడ్డారు. చివరకు 16 మంది నాకౌట్ రౌండ్‌లకు ఎపంఇక అయ్యారు. ఇందులో కోహ్లీతో పాటూ లియోనల్ మెస్సీ, నో వాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్ఇస్టియానో రొనాల్గో, మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఉన్నారు.
ఫైనల్ రౌండ్‌కు మెస్సీ, కోహ్లీ వచ్చారు. ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అయితే కోహ్లీ మేనియా ముందు మెస్సీ నిలబడలేకపోయాడు. విరాట్‌కు 78శాతం ఓట్లు రాగా...మెస్సీకి 22శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. దీంతో కింగ్ కోహ్లీ యునానిమస్‌గా ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 దక్కించుకున్నాడు.