VIRAT KOHLI : టీ20లకు స్టార్ బ్యాటర్ గుడ్‌ బై

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌లో తన రిటైర్మెంట్‌ను అనౌన్స్ చేశాడు.

VIRAT KOHLI : టీ20లకు స్టార్ బ్యాటర్ గుడ్‌ బై
New Update

Virat Kohli Says Good Bye To T20 : చివరి మ్యాచ్‌ ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). 59 బంతుల్లో 76 పరుగులు 6 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి.. ఫైనల్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ తరువాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో విరాట్ టీ20 లకు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని చెప్పేశాడు.

ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup). మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్‌ తరఫున ఇదే నా చివరి టీ20. నేను ఈ ప్రపంచ కప్‌ గెలవాలని కోరుకున్నా. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాం. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్‌. ఈ వరల్డ్ కప్‌ విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. ఇది అద్భుతమైన రోజు విరాట్ ఎమోషనల్ అయ్యాడు.

Also Read:17 ఏళ్ళ కల నెరవేరింది…వరల్డ్‌కప్‌ను సగర్వంగా అందుకున్న టీమ్ ఇండియా

#t20-world-cup #good-bye #virat-kohli
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి