IND vs AFG: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఇక అఫ్ఘాన్‌కు దబిడి దిబిడే.. తుది జట్టు ఇదే!

రేపు(జనవరి 14) ఇండోర్‌ వేదికగా అఫ్ఘాన్‌పై భారత్‌ రెండో టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి విరాట్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

IND vs AFG: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఇక అఫ్ఘాన్‌కు దబిడి దిబిడే.. తుది జట్టు ఇదే!
New Update

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli)ని టీ20 ఫార్మెట్‌లో చూసి చాలా కాలం అయ్యింది. ఐపీఎల్‌(IPL) అయితే ఆడాడు కానీ.. 2022 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ పొట్టి మ్యాచ్‌లకు కింగ్‌ దూరంగా ఉన్నాడు.. అంటే విరాట్‌ కోహ్లీ ఇండియా తరుఫున టీ20లు ఆడి దాదాపు 14నెలల దాటింది. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్‌తో ఇండియా టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక టీ20 ముగిసింది కూడా. అందులో రోహిత్ టీమ్‌ విక్టరీ కొట్టింది. ఇక రేపు(జనవరి 14) ఇండోర్‌ వేదికగా రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా 14 నెలల తర్వాత కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టనున్నాడు.

సిరీస్‌పై కన్నేసిన భారత్:
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో అఫ్ఘానిస్థాన్‌తో రెండో టీ20లో తలపడేందుకు భారత్ సన్నద్ధమతోంది. సుదీర్ఘ విరామం తర్వాత టీ20I ఫార్మాట్‌లో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్న విరాట్ కోహ్లీపై అందరి దృష్టి ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రేపటి ఇండోర్‌ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి టీ20Iలో శివమ్ దూబే తన అసాధారణ ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. చల్లని వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, దూబే ఒత్తిడిని తట్టుకుని, జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఇక ఇండోర్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది అత్యధిక స్కోరింగ్ ఇన్నింగ్స్‌లకు వేదిక.

భారత్ ప్లేయంగ్-11: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్ / యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ (WK), రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ / కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ / అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Also Read: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. సాధువులను చితకబాదిన స్థానికులు..

WATCH:

#virat-kohli #cricket #sports-news #cricket-news #india-vs-afghanistan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe