RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో కోహ్లీ తొలి సెంచరీ.. ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డ్ ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోని కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ సీజన్ లో తొలిశతక వీరుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. By Bhoomi 06 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL 17 : ఐపీఎల్(IPL) అనగానే కోహ్లీ(Kohli) కి పూనకం వస్తుంది. బ్యాటింగ్ తో చెలరేగి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. సిక్సులు, ఫోర్లతో ఉర్రూతలూగిస్తాడు. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals) కు వాళ్ల సొంత మైదానంలోనే చుక్కలు చూపించాడు కింగ్ కోహ్లీ. తొలి ఓవర్ నుంచి రాజస్థాన్ బౌలర్లను ఉరుకులు పరుగులు పెట్టించిన విరాట్..ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కేవలం 67 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ వచ్చిన వెంటనే చాలా వేగంగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 7500కు పైగా పరుగులు సాధించి భారీ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే. విరాట్ కోహ్లీ బ్యాట్ ఉపయోగించిన మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ తన 8వ సెంచరీని సాధించాడు. ఐపీఎల్లో అతను సెంచరీ చేసిన 7వ జట్టు. 2016లో గుజరాత్ లయన్స్(Gujarat Lions) పై రెండు సెంచరీలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అతి నెమ్మదిగా సెంచరీ కూడా ఇదే. ఐపీఎల్లో విరాట్ కోహ్లి అన్ని సెంచరీలు: రాజస్థాన్ రాయల్స్ - 113* పరుగులు పంజాబ్ కింగ్స్ - 113 పరుగులు గుజరాత్ లయన్స్ - 109 పరుగులు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ - 108* పరుగులు గుజరాత్ టైటాన్స్ - 101* పరుగులు గుజరాత్ లయన్స్ - 100* పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్ - 100 పరుగులు సన్‌రైజర్స్ హైదరాబాద్ - 100 పరుగులు నిరుడు సీజన్లో రెండు సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. రాజస్థాన్ బౌలర్లకు తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు . పవర్ ప్లేలో చితక్కొట్టిన కోహ్లీ ఆ తర్వాత దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి దాటించాడు. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీకి చేరువైన విరాట్ ఆర్సీబీ స్కోర్ బోర్డును జెట్ స్పీడ్ తో పరిగెత్తులా చేశాడు. అయితే.. హాఫ్ సెంచరీకి చేరువైన డూప్లెసిస్(44) చాహల్ బౌలింగ్‌లో బట్లర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(1) మరోసారి నిరాశకు గురిచేశాడు. బర్గర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొత్త బ్యాటర్ సౌరవ్ చౌహన్() ఒక సిక్సర్‌తో కాస్త పర్వాలేదనిపించుకున్నాడు. యశస్వీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆ తర్వాత కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. బర్గర్ ఓవర్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేశాడు. దాంతో, ఆర్సీబీ 183 పరుగులు స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇది కూడా చదవండి : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.! #royal-challengers-bangalore #virat-kohli #rcb #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి