Virat Kohli Century: 500వ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. కింగ్ కెరీర్‌లో ఈ మ్యాచ్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో 500వ మ్యాచ్‍లో సెంచరీ నమోదుచేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli Century: 500వ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ
New Update

publive-image

టెస్టుల్లో 29.. కెరీర్‌లో 76..

విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. విండీస్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ చేశాడు. దీంతో ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టుల్లో సెంచరీ సాధించడం ఓ విశేషమైతే.. అది తన 500వ అంతర్జాతీయ మ్యాచులో చేయడం మరో విశేషం. అంతేకాకుండా తన కెరీర్‌లో 29వ టెస్టు శతకంతో పాటు కెరీర్‌ మొత్తంలో 76వ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది మార్చిలో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన కోహ్లీ.. మళ్లీ వెస్టిండీస్‌ టూర్‌లో సెంచరీ బాదాడు.

కోహ్లీ కంటే ముందు సచిన్..

ఆసియా ఉపఖండం అవతల విరాట్ కోహ్లీకి ఇది 28వ సెంచరీ. విరాట్ కంటే ముందు 29 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్టులో ముందున్నాడు. 500 మ్యాచుల తర్వాత సచిన్ 75 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే, కోహ్లీ 76 సెంచరీలతో ముందున్నాడు. ఇంకో 25 సెంచరీలు చేస్తే సచిన్ 100 సెంచరీలు రికార్డును అధిగమిస్తాడు. అయితే ఈ ప్రపంచ రికార్డు సాధ్యం కావాలంటే కోహ్లీ మరింత వేగంగా పరుగులు చేయాలి. ప్రస్తుతం కోహ్లీ వయసు 34. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇండియా టీమ్‌లో ఇప్పుడున్న పోటీ దృష్ట్యా మరో రెండు, మూడేళ్లు మాత్రమే జట్టులో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే 2027 వరల్ట్‌కప్ వరకు జట్టులో ఉంటే మాత్రం కచ్చితంగా సచిన్ రికార్డును బద్దలుకొడతాడు అనడంతో ఎలాంటి సందేహం లేదు.

సింగిల్ రన్ కోసం 21 బంతులు..

ఇక ఈ టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాటర్లు కరేబీయన్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే స్కోర్ 300 దాటింది. ఇదే జోరు కొనసాగిస్తే 450 పరుగులు చేసే అవకాశం ఉంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 57, కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీ నమోదుచేసుకున్నాడు. అయితే ఈ మ్యాచులో మరో విశేషం ఏంటంటే కోహ్లీ సింగిల్ రన్ తీయడానికి 21 బంతులు ఆడాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది కూడా ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఇక రోహిత్ సేన విజయం సాధిస్తే రెండు టెస్టుల సిరీస్ భారత్ సొంతం కానుంది.

#virat-kohli #cricket #india #century #westindies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe