Virat: ఏకైక క్రికెటర్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2008 మార్చి 11న RCB జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆరంభ సీజన్‌ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.

New Update
Virat: ఏకైక క్రికెటర్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

RCB: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే లెక్కలేనన్ని ఘనతలు దక్కించుకున్న కోహ్లీ.. ఇప్పడు ఒకే జట్టుకు విరామం లేకుండా 16ఏళ్లు ప్రతినిథ్యం వహించిన ఏకైక క్రికెట్ ప్లేయర్ గా అవతరించాడు. అనామకుడిగా ఆర్ సీబీ టీమ్‌లోకి అడుగుపెట్టిన విరాట్ అనతికాలంలోనే తనదైన ముద్ర వేసి కెప్టెన్ గా ఎదిగిన తీరు అద్భుతం.

నేటితో 16 ఏళ్లు..
ఈ మేరకు మార్చి 11, 2008న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టులోకి అడుగుపెట్టిన విరాట్.. నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలో ఆరంభ సీజన్‌ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే కావడం విశేషం. మరే ఆటగాడు కూడా ఇన్ని సీజన్లు ఒకే ఫ్రాంఛైజీకి ఆడలేదు. ఇక అండర్‌-19 ప్రపంచకప్‌లో 47 సగటుతో 235 పరుగులు చేసి టోర్నీలో సెకండ్ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు కోహ్లీ. ఈ టోర్నీలో వెస్టిండీస్‌పై సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోహ్లీలోని ప్రతిభను గుర్తించి 2008 సీజన్‌కు గాను రూ.12 లక్షలకు ఆర్సీబీ అతడిని తీసుకుంది.

ఇది కూడా చదవండి: BCCI: బీసీసీఐకి శార్దూల్ రిక్వెస్ట్.. పునరాలోచన చేయాలన్న ద్రవిడ్!

లీగ్‌ చరిత్రలో టాప్‌ స్కోరర్‌..
ఈ క్రమంలో తొలి సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 165 పరుగులే చేసిన కోహ్లీ ఇప్పుడు లీగ్‌ చరిత్రలో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడి 7,263 రన్స్‌ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 50 అర్ధ సెంచరీలున్నాయి. 2013 సీజన్‌ ఆరంభానికి ముందు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2016లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లినా విజేతగా నిలపలేకపోయాడు. కోహ్లీ 2021 సీజన్‌ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2024 మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, ఆర్సీబీలు తలపడనున్నాయి.

Advertisment
తాజా కథనాలు