Virat: ఏకైక క్రికెటర్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2008 మార్చి 11న RCB జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆరంభ సీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.