Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు!
అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు.