/rtv/media/media_files/2025/03/07/3tGAOPYASlkzGFfRiWoU.jpg)
snake in ice cream
Viral News: ఆహారంలో బొద్దింకలు, పురుగులు, బల్లులు ప్రత్యక్షమైన సంఘటనల గురించి అందరూ వినే ఉంటారు. ఏకంగా పాము రావడం.. అది కూడా గడ్డ కట్టి ఉండడం ఎప్పుడైనా చూశారా? వింటుంటేనే అదోరకంగా ఉంది కదా.. కానీ మీరు విన్నది నిజమే! ఓ వ్యక్తి రోడ్డుపక్కన బండి నుంచి ఐస్ క్రీం కొనగా.. అందులో చిన్న పాము పిల్ల ఫ్రీజ్ అయిపోయి కనిపించింది. ఈ సంఘటన థాయిలాండ్ లో వెలుగు చూసింది.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్
A man in Thailand got a shock when he unwrapped an ice cream bar he had bought, only to find a snake frozen whole inside the treat. #AsiaNewsNetwork
— Inquirer (@inquirerdotnet) March 6, 2025
READ MORE: https://t.co/KerSGdJmBK pic.twitter.com/JTh8ZWox3D
ఐస్ క్రీమ్ లో గడ్డకట్టిన పాము
థాయిలాండ్‌లోని ముయాంగ్ రట్చబురి ప్రాంతంలోని పాక్ థోకు చెందిన రెబాన్ నక్లియాంగ్‌బూన్ అనే యువకుడు రోడ్డు పక్కన ఉన్న బండిలో ఐస్క్రీమ్ కొన్నప్పుడు అతడు ఈ భయానక దృశ్యాన్నీ చూశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నక్లియాంగ్‌బూన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. ఐస్ క్రీమ్ లో పాము గడ్డకట్టి ఉండడం చూసి షాకవుతున్నారు. వీధి ఆహారాలు తినడం అంత సురక్షితం కాదని కామెంట్లు చేస్తున్నారు. అతడు పోస్ట్ చేసిన ఫోటోలో నలుపు, పసుపు రంగులో పాము తల స్పష్టంగా కనిపించింది. దీని ఆధారంగా ఆ పాము 'క్రిసోపెలియా ఆర్నాటా' కావచ్చునని నెటిజన్లు ఊహిస్తున్నారు. గతంలో ముంబైలో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఓ డాక్టర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా.. అందులో హ్యూమన్ ఫింగర్ వచ్చింది. కొంత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గట్టిగా అనిపించడంతో ఏంటని చూడగా.. అసలు విషయం తెలిసింది.