Viral Video: క్రేన్ ఎక్కి.. ఆపరేటర్‌ని కొట్టిన BJP ఎంపీ

విగ్రహవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఆవేశానికి లోనైయ్యాడు. లోక్‌సభ సభ్యుడు గణేష్ సింగ్ క్రేన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ చేసిన చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.

New Update
BJP MP

విగ్రహవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఆవేశానికి లోనైయ్యాడు. లోక్‌సభ సభ్యుడు గణేష్ సింగ్ క్రేన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ చేసిన చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. సత్నా లోక్‌సభ సభ్యుడు గణేష్ సింగ్ విగ్రహానికి దండ వేసేందుకు క్రేన్‌పైకి ఎక్కిన సమయంలో, క్రేన్ కొద్దిగా కదలడంతో ఆగ్రహానికి గురై, పక్కనే ఉన్న మున్సిపల్ కార్మికుడిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూనిటీ డే (ఏక్తా దివాస్) సందర్భంగా సత్నాలోని సిమరియా చౌక్ వద్ద డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసే కార్యక్రమం జరిగింది. విగ్రహం ఎత్తుగా ఉండటంతో, ఎంపీ గణేష్ సింగ్ దండ వేయడానికి వీలుగా ఒక హైడ్రాలిక్ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీ క్రేన్ బుట్టలో నిలబడి విగ్రహానికి దండ వేసిన తర్వాత, కిందికి దిగే క్రమంలో క్రేన్ ఒక్కసారిగా కదిలి లేదా ఆగిపోయింది.

దీంతో ఆందోళన చెందిన ఎంపీ గణేష్ సింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ సమయంలో క్రేన్ ఆపరేట్ చేస్తున్న మున్సిపల్ కార్మికుడు సహాయం చేయడానికి వచ్చాడు. క్రేన్‌ ఆపరేటర్‌పై ఎంపీ చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే ఆయన కార్మికుడి చెంపపై కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నెటిజన్లు ఎంపీ చర్యను తీవ్రంగా ఖండించారు. "అధికార అహంకారానికి ఇది పరాకాష్ట. ప్రజా సేవకుడిగా ఉండాల్సిన ఎంపీ, సహాయం చేయడానికి వచ్చిన ఒక సాధారణ కార్మికుడిపై చేయి చేసుకోవడం గర్హనీయం" అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికారికంగా ట్వీట్ చేసింది.

Advertisment
తాజా కథనాలు