Pineapple Dating: పైనాపిల్ డేటింగ్ మరోసారి ట్రెండింగ్‌లో ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా షాపింగ్‌కు వెళ్లినపుడు పైనాపిల్ కొనుక్కుని, దానిని వస్తువులు ఉంచే షాపింగ్ ట్రేలో పైనాపిల్‌ను రివర్స్‌లో ఉంచాలి. పైనాపిల్‌ను అలా రివర్స్‌లో అలా ఉంచినట్లయితే వారి డేటింగ్‌కు సిద్దమని అర్థం. వారితో ఎవరైతే డేటింగ్ చేయాలనుకుంటారో వారు కూడా పైనాపిల్‌ను రివర్స్‌లో ఉంచుతారు. ఇలా పైనాపిల్‌ను రివర్స్‌లో ఉంచినట్లయితే అబ్బాయి అమ్మాయి కోసం, అమ్మాయి అబ్బాయి కోసం వెతుకుతున్నట్లు అర్థం.
స్పెయిన్‌లో ట్రెండ్..
ఇది కూడా చదవండి: తిరుపతి భక్తులకు అలర్ట్.. ఆ మార్గం మూసివేత
షాపింగ్‌కు వెళ్లిన వారిలో పైనాపిల్‌ను ఇలా తిప్పి ఉంచిన వారి ఒకరినొకు చూసుకుని పరిచయం చేసుకుంటారు. ఇలా వారిద్దరు ఒకరినొకరు కలుసుకుని డేటింగ్‌కి వెళ్తారు. పైనాపిల్ డేటింగ్ గురించి పలు రకాల షాపింగ్ మాల్స్ వారు ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పెయిన్‌లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: కూతురిపై కొండంత ప్రేమ... తండ్రి చేసిన పనికి ప్రశంసల వెల్లువ