/rtv/media/media_files/2024/12/28/YZjHZbFX5uWNFf6WBktk.jpg)
Viral Video Danapur Express Train Photograph
Viral Video: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు దగ్గరి నుంచి వెళ్తేనే గుండెలు అదిరిపోతాయి. అలాంటిది ఓ వ్యక్తి రైలు కింద దాక్కుని ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇటార్సి-జబల్‌పూర్ మధ్య నడుస్తున్న మధ్య నడుస్తున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల కింద దాక్కుని ఒక యువకుడు జబల్‌పూర్ చేరుకున్నాడు. రైలులోని ఎస్4 కోచ్‌ను తనిఖీ చేస్తుండగా రైలు చక్రాల దగ్గర దాక్కున్న యువకుడిని రైల్వే ఉద్యోగులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
టికెట్ కొనేందుకు డబ్బులు లేక..
రైల్వే ఉద్యోగులు ఈ విషయాన్ని రైల్వే పోలీస్ ఫోర్స్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత RPF యువకుడిని అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడి వద్ద రైలులో ప్రయాణించేందుకు డబ్బులు లేవని, అందుకే చక్రాల మధ్య దాక్కుని ఇటార్సీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్లాడని చెబుతున్నారు. రైల్వే ఉద్యోగులు రైలును తనిఖీ చేస్తున్నప్పుడు చక్రాల కింద ఏదో కదులుతుండటం గమనించామని, తీరా చూస్తే లోపలి నుంచి ఓ యువకుడు బయటికి వచ్చాడని చెబుతున్నారు.
जान जोखिम में डालक शख्स कर रहा था ट्रेन का सफर,युवक के खतरनाक और जानलेवा सफर का वीडियो आया सामने,बोगी के नीचे बनी ट्रॉली में छुपकर युवक ने तय किया 250 किलोमीटर का सफर,ट्रेन नं.12149,#railmin #wcr #jabalpur #AshwiniVaishnaw pic.twitter.com/pnoDgyFi0X
— Journalist Rajesh Vishwakarma (@rajeshjbp63101) December 26, 2024
అతని దగ్గర టికెట్ లేదని, టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేక ఈ పని చేసినట్టు చెబుతున్నారు అధికారులు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీరియస్‌గా తీసుకున్నట్లు రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారులు తెలిపారు. దీంతోపాటు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే పోలీస్ ఫోర్స్ మొత్తం వ్యవహారంపై తదుపరి విచారణ జరిపి చర్యలు తీసుకుంటోంది. యువకుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: దానిమ్మ తొక్కతో కూడా బరువు తగ్గొచ్చు..తెలుసా?