Elon Musk Lookalike: సడన్‌గా చూసి 'ఎలన్ మస్క్‌' అనుకున్నాం కదరా..! సేమ్ టు సేమ్ ఉన్నాడుగా

లక్సెంబర్గ్‌ సిటీలో నివసించే 28ఏళ్ల సింగర్ హ్యూగో వన్ అచ్చు గుద్దినట్టు ఎలన్ మస్క్‌లా కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే ఈ పోలిక తన సంగీత ప్రయాణానికి అడ్డుగా మారిందని, ఇబ్బందిగా ఉందని హ్యూగో వన్ చెబుతున్నాడు.

New Update
Elon Musk Lookalike

Elon Musk Lookalike

Elon Musk Lookalike: లక్సెంబర్గ్ సిటీలో నివసిస్తున్న 28 ఏళ్ల యువ గాయకుడు హ్యూగో వన్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ లాగా ఉన్నాడంటూ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అయ్యాడు. అయితే, ఈ పోలిక అతనికి చాలా ఇబ్బందికరంగా మారింది. సింగర్ గా గుర్తింపు పొందాలని ఆశించిన హ్యూగోని అందరూ మస్క్ తో పోలుస్తూ వైరల్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

సోషల్ మీడియాలో వైరల్..

2018లో జర్మనీలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు మొదటిసారిగా తనను మస్క్ లా ఉన్నావంటూ జనాలు పోల్చడం మొదలుపెట్టారు. సూపర్‌మార్కెట్‌లో, పబ్‌లో, ఇతర ప్రదేశాల్లో ఇలా ఎక్కడికి వెళ్లినా హ్యూగోను చూసిన వారు ఎలన్ మస్క్‌ను చూసినట్లు ఉందంటూ అతనితో ఫోటోలు తీసుకునేవారు. ఇటీవల, స్కాట్లాండ్‌లోని అబర్డీన్‌లో జరిగిన ఒక రీయూనియన్‌లో, అతన్ని చూసిన కొంత మంది యువకులు ఎలన్ మస్క్ అని పిలుస్తూ అతనితో ఫోటోలు దిగారు. ఈ సంఘటనను వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో హ్యూగో పోస్ట్ చేసాడు. ఆ వీడియోకి ఏకంగా 150 లక్షల వ్యూస్‌ను వచ్చాయి.

Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

అయితే, హ్యూగో మాత్రం ఈ పోలికలను ప్రశంసగా భావించడం లేదని చెప్తున్నాడు. మస్క్‌ తో పోల్చడం తనకు ఇష్టం లేదని, ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం తనకు అస్సలు నచ్చవని చెప్తున్నాడు. అయితే, ఈ పోలిక అతని మ్యూజిక్ కెరీర్‌కు మాత్రం ప్లస్ అయిందట. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన వీడియోల ద్వారా అతని పాటలకు మంచి ట్రాఫిక్ వచ్చిందని హ్యూగో తెలిపారు.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

హ్యూగో, మస్క్‌తో తన పోలికను ఒప్పుకున్నప్పటికీ, మస్క్‌కి సంబంధించిన అభిప్రాయాలు, విశ్వాసాలతో మాత్రం అస్సలు ఏకీభవించడం లేదు. "మస్క్‌తో పోల్చడం నాకు ప్రశంస కాదు, ఎందుకంటే అతను మంచి వ్యక్తి కాదు." అని హ్యూగో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

Also Read: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు