/rtv/media/media_files/2025/10/18/chicken-masala-1-2025-10-18-16-30-43.jpg)
దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఇక పండుగ సందర్భంగా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు పలు రకాల బహుమతులు ఇస్తున్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు, ట్రాలీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చి సంతోషపరుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఓ అడుగు ముందుకేసి తమ సిబ్బందికి లగ్జరీ కార్లు, బైక్‌లు, బంగారు ఆభరణాలు, అపార్ట్‌మెంట్స్‌ను బహుమతిగా అందిస్తున్నాయి.
మహారాష్ట్రలోని ఓ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు వచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి వారు షాక్ అయ్యారు. పంధర్‌పూర్‌లోని ప్రఖ్యాత విఠల్ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు అధికారులు దివాళీ గిఫ్ట్‌గా చికెన్ మసాలా ప్యాకెట్లను అందించారు. సెక్యూరిటీ గార్డ్స్, ఇతర ఉద్యోగులతో సహా అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వీటిని అందించారు. అయితే, ఆలయ ఉద్యోగులకు చికెన్ మసాలా ప్యాకెట్లు ఇవ్వడం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.