Viral Video: బీహార్‌లో 'పుష్ప' మేనరిజం.. నడిరోడ్డుపై ఆకతాయిల రచ్చ: వీడియో

బీహార్ లో కొంతమంది కుర్రాళ్ళ అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలే' అంటూరోడ్లపైన రెచ్చిపోయారు. 'పుష్ప'  సినిమాలోని 'తగ్గేదేలే'  డైలాగ్ ని అనుసరిస్తూ రోడ్డుపై రీల్ వీడియో చేశారు.

New Update

Viral Video: ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యూత్. నడి రోడ్లపై  డాన్సులు వేయడం, రైలు పట్టాలపై స్టెంట్లు చేయడం వంటి వికృత చేష్టలతో వైరల్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కొంతమంది కుర్రాళ్ళ అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలే' అంటూరోడ్లపైన రెచ్చిపోయారు. 'పుష్ప'  సినిమాలోని 'తగ్గేదేలే'  డైలాగ్ ని అనుసరిస్తూ రోడ్డుపై రీల్ వీడియో చేశారు. అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ రెచ్చిపోయారు. దీంతో ఊళ్ళో వాళ్లంతా రోడ్డుపై గుమిగూడి వీళ్ళ రచ్చను  చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియా సెన్షేషన్

''నీయవ్వ తగ్గేదే లే''.. అల్లు అర్జున్ పుష్ప 2లోని ఈ డైలాగ్ సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. అల్లు  అర్జున్ తన భుజంపై చేయి వేసి, స్టైల్‌గా చెప్పిన ఈ డైలాగ్ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అల్లు అర్జున్ స్టైల్ ని అనుసరిస్తూ ఈ డైలాగ్ పై రీల్స్ వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో  వందల కొద్దీ మీమ్స్,  రీల్స్ పుట్టుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డైలాగ్  వైరల్ అయ్యింది. ఈ సినిమా విడుదలై ఏడాది గడిచిన ఇంకా డైలాగ్ క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ దీనిపై రీల్స్, వీడియోలు చేస్తున్నారు యూత్.

Advertisment
తాజా కథనాలు