Viral Video: ఛీ.. షాప్‌కి వచ్చి ఇదేం పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ!

బెంగళూరు సిటీలో ఏవెన్యూ రోడ్డులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాదాపు రూ. 90,000 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై షాప్ ఓనర్, హెల్పర్ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.

New Update
Woman Stealing Sarees

బెంగళూరు సిటీలో ఏవెన్యూ రోడ్డులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాదాపు రూ. 90,000 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై షాప్ ఓనర్, హెల్పర్ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అలాగే ఆమెను కొట్టేటప్పుడు వీడియోలు తీశారు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హుంపమ్మ అనే మహిళ చీరల దుకాణంలోకి వచ్చి, చీరల బండిల్‌ను దొంగిలించింది. ఈ చోరీ దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలోరికార్డయ్యాయి. తర్వాత ఆ మహిళ మళ్లీ దుకాణానికి వచ్చి మరిన్ని చీరలు దొంగిలించడానికి ప్రయత్నించింది. ఈసారి షాప్ ఓనర్ ఆమెని గుర్తించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత ఆమెని బయటకు లాక్కొచ్చి, వీధిలో అందరూ చూస్తుండగానే కొట్టాడు. పదేపదేచెంపదెబ్బలు కొట్టడం, కాలితో తన్నడం చేశారు. చుట్టుపక్కల స్థానికులు కొందరు జరిగిన దాన్ని వారి ఫోన్లలో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది.

ఘటనపై బెంగళూరు పోలీసులు రెండు వేర్వేరు కేసులను నమోదు చేశారు. చీరల దొంగతనం ఆరోపణలపై మహిళ (హుంపమ్మ)పై, ఆమెపై దాడి చేసినందుకు షాప్ ఓనర్‌పై మరో కేసు ఫైల్ చేశారు. దొంగతనం చేసిన మహిళతో పాటు దాడికి పాల్పడిన షాప్ యజమాని, హెల్పర్‌ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ముగ్గురినిజ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Advertisment
తాజా కథనాలు